Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంపీ లక్ష్మణ్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:19 AM

బీజేపీ సంస్థాగత ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసి న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న....

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎంపీ లక్ష్మణ్‌కు ఘన స్వాగతం

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సంస్థాగత ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసి న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయనకు బీజేపీ నేతలు శాలువలు కప్పి, పూలమాలలు వేసి స్వాగతించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్‌ భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. పార్టీ పెద్దలు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యకర్తలు, నాయకుల అండదండలతోనే ఈ పని పూర్తి చేశానని చెప్పారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీలో ఆయన హైదరాబాద్‌కు వెళ్లారు.

Updated Date - Jan 23 , 2026 | 04:19 AM