మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - May 27 , 2026 | 04:21 AM
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. వివిధ పనులు చేసుకునే మహిళలకు ..
సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
బంజారాహిల్స్, మే 26 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. వివిధ పనులు చేసుకునే మహిళలకు వసతి కల్పించేందుకు సఖి నివాస్ (వన్ స్టాప్ సెంటర్)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 మిథులానగర్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ఆమె ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చే మహిళలకు సురక్షితమైన వసతి కల్పించేందుకు ప్రభుత్వం సఖీ పేరిట వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. చిన్న పిల్లలతో వచ్చే తల్లులు కూడా ఇక్కడే బస చేసే విధంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.