Share News

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:36 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సూచించారు.

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించాలి

  • కొత్త చట్టంతో రాష్ట్రాలపై భారీగా ఆర్థిక భారం: సీతక్క

న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సూచించారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త చట్టంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను స్పష్టం చేస్తూ కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై రూ.వేల కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీల వేతనాలను 100 శాతం, మెటీరియల్‌ కాంపోనెంట్‌లో 75 శాతం కేంద్రమే భరించేదని గుర్తుచేశారు. కానీ, కొత్త విధానంలో 60:40 నిష్పత్తిని తీసుకురావడం వల్ల తెలంగాణపై సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఇప్పటికే ఈ అంశంపై సమగ్రంగా చర్చించిందని, 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Jun 30 , 2026 | 04:36 AM