హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీతక్క
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:00 AM
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ హమాలీ కార్మికుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
హనుమకొండలో టీహెచ్‌ఎంయూ దశాబ్ది హమాలీ మహా గర్జన
హనుమకొండ టౌన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ హమాలీ కార్మికుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హమాలీ కార్మికులకు సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివారం తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ (టీహెచ్‌ఎంయూ) దశాబ్ది హమాలీ మహాగర్జన కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హమాలీ కార్మికులకు హెల్త్ కార్డులు, బీమా సదుపాయాలు కల్పిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు హనుమకొండలోని వేలాదిమంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.