భారత్‌లో ఎస్‌ఈడీ లెర్నింగ్ ఫ్లాట్‌ఫాం
ABN , Publish Date - Mar 21 , 2026 | 05:15 AM
అమెరికాకు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నొస్టిక్ (ఎస్‌ఈడీ) సంస్థ భారత్‌లో న్యూరోసైన్స్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది.
శ్రీచైతన్య విద్యాసంస్థలతో ఒప్పందం
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నొస్టిక్ (ఎస్‌ఈడీ) సంస్థ భారత్‌లో న్యూరోసైన్స్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు, ఎస్‌ఈడీ మధ్య శుక్రవారం ఎంఓయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎస్‌ఈడీ వ్యవస్థాపకుడు శ్రీనేశ్ మాట్లాడుతూ.. నేర్చుకోవడంలో ప్రతీ విద్యార్థికి ఓ ప్రత్యేకమైన విధానం ఉంటుందని, కానీ ప్రస్తుత వ్యవస్థ ఫలితాల ఆధారంగానే అంచనా వేస్తోందన్నారు. ఈ ఫ్లాట్‌ఫాం విద్యావ్యవస్థలో కీలక మార్పు తెస్తుందని ఎస్‌ఈడీ సీఇవో సంబాలుక్ పేర్కొన్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సీమ బొప్పన మాట్లాడుతూ దీని ద్వారా ప్రతి విద్యార్థికి వ్యక్తిగత విద్యాసహాయాన్ని అందించవచ్చన్నారు. కాగా ఎస్‌ఈడీ 19వ తేదీన హైదరాబాద్‌లో తన అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.