Share News

ఈవీఎంల భద్రత కీలకం

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:15 PM

జి ల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ బుధ వారం తనిఖీ చేశారు.

ఈవీఎంల భద్రత కీలకం
ఈవీఎంలు భద్రపర్చిన గోదామును తనిఖీ చేసి రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- గోదామును తనిఖీ చేసిన కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : జి ల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ బుధ వారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదా ములో భద్రపర్చిన ఈవీఎంలను రాజకీయ పా ర్టీల నాయకులతో కలిసి కలెక్టర్‌ పరిశీలిం చారు. వాటిభద్రతకు ఏర్పాటు చేసిన పటిష్టమైన ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్య వస్థ, లాక్స్‌, సీల్స్‌ తదితర సాంకేతిక అంశాలను వివరంగా పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని అన్నారు. కలెక్టర్‌వెంట ఎన్నికల విభాగపు సూపరింటెం డెంట్‌ రవికుమార్‌, సిబ్బంది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆటిజం నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రజల్లో వచ్చే ఆటిజం (వ్యాధి) నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రెసిప్లైస్‌ ఆటిజం రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఆర్‌ఏ ఆర్‌ఐ) ప్రజాసం బంధాల అధికారి పి.లాలూ ప్రసాద్‌ ప్రభుత్వా న్ని కోరారు. బుధవారం ఆయన కలెక్టర్‌ బదావ త్‌ సంతోష్‌ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడు తూ దశాబ్దాలుగా దేశంలో, రాష్ట్రంలో ఆటిజం కేసులు పెరుగుతున్నాయని అన్నారు. పుట్టిన ప్రతీ 50 పిల్లల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం సమస్యలు అనేక మంది పిల్లల్లో కనిపిస్తామని, దీని కారణంగా పిల్లల నిద్ర, అభ్యసన ప్రవర్త నపై ప్రభావం పడుతుందన్నారు. జిల్లాలో ఆ టిజం నిర్మూలనపై ప్రభుత్వం అవగాహన క ల్పించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

Updated Date - Jan 07 , 2026 | 11:15 PM