పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:21 PM
జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మునిసిపాలిటీల్లో జరిగే ఎన్నికలు అత్యంత పార దర్శకంగా, సజావుగా కొనసాగేలా పటిష్ట ఏర్పా ట్లు చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నా రు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మునిసిపాలిటీల్లో జరిగే ఎన్నికలు అత్యంత పార దర్శకంగా, సజావుగా కొనసాగేలా పటిష్ట ఏర్పా ట్లు చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నా రు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రా ష్ట్రంలోని మునిసిపాలిటీల సాధారణ ఎన్నికలు- 2026 జిల్లాకు మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సాధారణ పరిశీలకులుగా రాజ్యల క్ష్మి, వ్యయ పరిశీలకులుగా భీమ్లా నాయక్‌ను నియమించి నట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం వారు కలెక్ట ర్‌ను కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి, సమావే శమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మునిసిపా లిటీలలోని 65 వార్డుల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుం దని కలెక్టర్ తెలిపారు. 131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు.
పార్టీలు సహకరించాలి
జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఎన్నిక లు ప్రశాంతంగా జరిగేందుకు రా జకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అదన పు కలెక్టర్ దేవసహాయం, గుర్తింపు పొందిన వి విధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సమా వేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నా మినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రతీ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల ప్రకారం కొనసాగేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పట్టణ పరిధిలో ఉన్న అన్ని రాజకీ య బ్యానర్లు, పోస్టర్లు, ప్లెక్సీలు, ఫొటోలు తదిత ర అభ్యంతకర ప్రచార సామగ్రిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా డేవిడ్ రాజు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రీశైలం, నరసింహ, బీజేపీ తర ఫున సుధాకర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బీఎస్పీ రామకృష్ణ, వైఎస్‌ఆర్ ఎండీ హుస్సేన్, టీడీపీ బాలకృష్ణ పాల్గొన్నారు.
ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలి
నాగర్‌కర్నూల్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీ ల ఎన్నికల సందర్భంగా ఎన్ని కల ప్రవర్తనా నియమావళిను క ఠినంగా అమలు చేయాలని కలె క్టర్ బదావత్ సంతోష్ పర్యవే క్షణ బృందాలకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు అమ రేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఎఫ్‌ఎస్ టీ, ఎస్‌ఎస్ టీ, జోనల్ అధికారులు, నోడల్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
మొదటి రోజు 32 నామినేషన్లు
నాగర్‌కర్నూల్ టౌన్/ కల్వకు ర్తి/ కొల్లాపూర్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) :జిల్లాలోని మూ డు మునిసిపాలిటీలలో నామినేషన్లపర్వం మొద లైంది. మొదటి రోజు 32 నామినేషన్లు దాఖ లు అయ్యాయి. నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీలో 24 వార్డుల నుంచి మొత్తం 10మంది అభ్యర్థుల నుంచి 11 నామినేషన్లు అందాయి. వాటిలో కాం గ్రెస్ 3, బీఆర్‌ఎస్ 7, బహుజన ముక్తిపార్టీ 1 నా మినేషన్ దాఖలు చేశారు. మునిసిపల్ కమిష నర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు. కల్వకుర్తి ముని సిపల్ కార్యాలయంలోని కేంద్రాల్లో మొదటి రోజు 14నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఏడుగురు నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ నుంచి 5, ఇండిపెండెంట్‌లు 2 నామినేష న్లు దాఖలైనట్లు కమిషనర్ మహమ్మద్ షేక్ తెలిపారు. ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, ఎంపీడీవో వెంక ట్రాములు పరిశీలించారు. కొల్లాపూర్, మునిసి పాలిటీలో తొలి రోజు ఏడు నామినేషన్లు దా ఖలయ్యాయని మునిసిపల్ కమిషనర్ యాదగి రి తెలిపారు. కొల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నామినేషన్ల ప్రక్రియ జరిగింది. సీఐ మహేష్, ఎస్‌ఐ సురేష్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.