Share News

సికింద్రాబాద్‌లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:56 AM

యూనిట్‌ హెడ్‌క్వార్టర్‌ కోటా(యూహెచ్‌క్యూ) కింద భారత సైన్యంలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ- 2026 సికింద్రాబాద్‌లో ఆగస్టు 10న ప్రారంభమై అక్టోబరు 11 వరకు జరగనుంది.

సికింద్రాబాద్‌లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

అల్వాల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): యూనిట్‌ హెడ్‌క్వార్టర్‌ కోటా(యూహెచ్‌క్యూ) కింద భారత సైన్యంలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ- 2026 సికింద్రాబాద్‌లో ఆగస్టు 10న ప్రారంభమై అక్టోబరు 11 వరకు జరగనుంది. సికింద్రాబాద్‌ ఏవోసీ సెంటర్‌ ముక్తార్‌ హాల్‌ వేదికగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు రక్షణశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ర్యాలీ ద్వారా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ (జీడీ), అగ్నివీర్‌ క్లర్క్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ అత్యుత్తమ క్రీడాకారులు, సంగీత విద్వాంసుల (ఓపెన్‌ కేటగిరి) విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం హెడ్‌క్వార్టర్‌ ఏవోసీ సెంటర్‌లో లేదా ఠీఠీఠీ.్జౌజీుఽజీుఽఛీజ్చీుఽ్చటఝడ.ుఽజీఛి.జీుఽ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Updated Date - Jul 14 , 2026 | 05:56 AM