Share News

‘22ఏ’తో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన!

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:39 AM

ధరణి పోర్టల్‌ నుంచి భూభారతికి రికార్డుల బదిలీ సమయంలో నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులను సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది

‘22ఏ’తో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన!
nhrc

  • తక్షణం విచారణ జరిపి 4 వారాల్లో నివేదిక ఇవ్వండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ నుంచి భూభారతికి రికార్డుల బదిలీ సమయంలో నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులను సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనని ఆక్షేపించింది. దీనిపై తక్షణం విచారణ చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డుల బదిలీ సమయంలో అధికారులు ఇష్టానుసారంగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారంటూ న్యాయవాది కారుపోతుల రేవంత్‌ ఈనెల3న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఆస్తులను అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి సాధ్య పడడం లేదని, ఫలితంగా మానసిక క్షోభతోపాటు ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 05:39 AM