గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:50 PM
గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శు లు క్రీయాశీలక పాత్ర పోషించాలని నాగర్‌క ర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నా రు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శు లు క్రీయాశీలక పాత్ర పోషించాలని నాగర్‌క ర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నా రు. బుధవారం కలెక్టరేట్‌లో పంచాయతీ కా ర్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, గ్రామీణ జీ వన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యం గా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అ మలు చేస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ స్థానిక ప్రజాప్ర తినిధులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగు నీరు, మౌలిక వసతులు, హరితహారం, నిధు ల వినియోగం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల పరిధి లోని ప్రభుత్వ పాఠశాలలు, గురులాలు, కేజీ బీవీలను అధికారులు తరచుగా తనిఖీ చేయా లని సూచించారు. గ్రామ పరిధిలో వచ్చే ప్ర జా ఫిర్యాదులను సాధ్యమైనంత వరకు గ్రా మ స్థాయిలోనే పరిష్కరించాలని సూచించా రు. మీ పరిధిలో లేని అంశాలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బా ధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.