Secretariat Officials Association: డిప్యూటీ సెక్రటరీలకు ప్రత్యేక చాంబర్స్ కేటాయించండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:51 AM
సచివాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ కార్యదర్శులు (డీఎస్), అంతకంటే పైస్థాయి అధికారులందరికీ ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు..
సీఎ్‌సకు సచివాలయ అధికారుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): సచివాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ కార్యదర్శులు (డీఎస్), అంతకంటే పైస్థాయి అధికారులందరికీ ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ సచివాలయ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావును కలిసిన సంఘం అధ్యక్షుడు గంధం సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి.. పలు విన్నపాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధికారుల సంఘం 2026 డైరీని సీఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా సచివాలయ పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన టెక్నికల్ స్టాఫ్‌ను నియమించాలని కోరారు. ఈ విన్నపాలపై సీఎస్ సానుకూలంగా స్పందించారని సురేష్ తెలిపారు.