రాష్ట్రంలో భానుడు భగ..భగ..
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:11 AM
రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని పెర్కిట్, భీంగల్, మల్కాపూర్‌లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత
నిజామాబాద్ జిల్లాలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
జాతీయ రహదారులపై ఎండమావులు
యాదాద్రి, నిజామాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని పెర్కిట్, భీంగల్, మల్కాపూర్‌లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. మరో 4రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారులు మధ్యాహ్న వేళ ఎండమావులను తలపించాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఎండల తీవ్రతకు ఇబ్బందిపడ్డారు. కొండపై నీడకోసం జర్మనీ టెక్నాలజీ టెంట్లు, కాళ్లు కాలకుండా కార్పెట్లు వేసినప్పటికీ, భక్తుల రద్దీకి సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి.