పాఠశాలలు సమాజానికి బలమైన పునాదులు
ABN , Publish Date - May 14 , 2026 | 12:50 AM
పాఠశాలలు సమాజానికి బలమైన పునాదిలాంటివని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణ పరిధిలోని నాంపల్లి గ్రామం నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
వేములవాడ, మే 13 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు సమాజానికి బలమైన పునాదిలాంటివని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణ పరిధిలోని నాంపల్లి గ్రామం నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ప్రభత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయడానికి నాణ్యమైన బోధన మెరుగైన మౌలిక వసతులు డిజిటల్ విద్య, విద్యార్థుల సంక్షేమం, ప్రజల భాగస్వా మ్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ప్రజా ప్రభత్వం వచ్చాక హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ సందర్శించామని, పాఠశాలను ఆక్షనీయంగా తీర్చిదిద్ది వారికి అన్ని ఆటలు ఆడటం కోసం సదుపాయాలు కల్పిస్తున్నారని వివరించారు. నూతనంగా డీఎస్సీ ద్వారా 10 వేల 6 మంది ఉపాధ్యాయులను నియామకం చేసినట్లు తెలిపారు. అన్ని పాఠశాలలో ఉచిత విద్యుత్, ఉచిత ఇంటర్నెట్ అందిస్తున్నామని, విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పార్యపుస్తకాలు, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతాయని, చదువులు మానివేతలు తగ్గుతాయని, తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈవో జగన్మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్ కాశ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌లు బొజ్జ మల్లేశం యాదవ్, తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్భన్ మండలం చిర్లవంచ, గుర్రంవానిపల్లి, వేములవాడ పట్టణంలో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాలకు హజరై లబ్దిదారులకు నూతన వస్ర్తాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.