Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు స్కూల్‌ కిట్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 10:22 PM

వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి సర్కారు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు స్కూల్‌ కిట్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. జిల్లాలోని కొన్ని చోట్ల ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పలు పాఠశాలలు మూసివేత దిశగా తిరోగమనం చెందుతు న్నాయి

kumaram bheem asifabad- విద్యార్థులకు స్కూల్‌ కిట్లు
లోగో

- బడులు తెరిచిన రోజే అందజేసేలా ప్రణాళిక

- జిల్లాలో 99,283 మంది విద్యార్థులకు లబ్ధి

వాంకిడి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి సర్కారు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు స్కూల్‌ కిట్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. జిల్లాలోని కొన్ని చోట్ల ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పలు పాఠశాలలు మూసివేత దిశగా తిరోగమనం చెందుతు న్నాయి. దీంతో వీటిలో నమోదు శాతాన్ని పెంచి ప్రభుత్వ పాఠశాలలకు వైభవాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు సమానంగా బలోపేతం చేసేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యారు ్థలకు పలు సామగ్రితో కూడిన స్కూల్‌ కిట్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, రాగి జావ వంటివాటిని అందిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో దాతలు ముందుకు వచ్చి క్రీడా దుస్తులు, క్రీడా కిట్లు అందించడంతో ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.

- 1,270 ప్రభుత్వ పాఠశాలలు..

జిల్లాలో మొత్తం 1,270 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 99,283 మంది విద్యార్థులు చదువుతు న్నారు. వీరందరికి స్కూల్‌ కిట్లు అందజేయనున్నారు. ప్రభుత్వ ఇచ్చే కిట్లలో నోటు పుస్తకాలు, వర్క్‌ పుస్తకా లు, ఏకరూప దుస్తులు, స్కూల్‌ బ్యాగ్‌లు, బూట్లు, సాక్సులు, బెల్ట్‌లు, టై, ఐడీకార్డులు, పెన్సిళ్లు, తదితరాల తో కూడిన 22 రకాల వస్తువులు ఉండబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్ది విద్యార్థుల హాజరుశాతం పెంచాలన్న లక్ష్యంతోనే కిట్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మైరుగైన విద్యతో పాటు కిట్లు అందనున్నాయి. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ బీసీ వసతిగృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు కిట్లు అందజేయ నున్నారు. వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కు దుప్పటి, క్రీడా దుస్తులు, పీటీ డ్రెస్‌, బ్లేజర్‌ తదితర వస్తువులు అందజేయనున్నారు.

విద్యార్థులకు ప్రయోజనకరం..

- శివరచరణ్‌కుమార్‌, వాంకిడి ఎంఈవో

కిట్ల పంపిణీతో విద్యార్థులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. తల్లి తండ్రులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు వారి ఆలోచనా సరళిలో కూడా మార్పు వస్తుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో హాజరుశాతం పెరిగి ఉత్తమ ఫలితాల సాధనకు తోడ్పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపే తానికి ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Jan 20 , 2026 | 10:22 PM