Share News

పాఠశాల స్థలాన్ని పరిరక్షించాలి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:33 PM

కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థలాన్ని పరి రక్షించాలని గ్రామస్థులు, పూర్వ విద్యార్థు లు కోరారు.

పాఠశాల స్థలాన్ని పరిరక్షించాలి
తహసీల్దార్‌ ఇబ్రహీంకు వినతి పత్రం అందజేస్తున్న తర్నికల్‌ పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు

- తహసీల్దార్‌, ఎంఈవో, ఎంపీడీవోలకు వినతి

కల్వకుర్తి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థలాన్ని పరి రక్షించాలని గ్రామస్థులు, పూర్వ విద్యార్థు లు కోరారు. పాఠశాలకు చెందిన 5.20 ఎక రాల స్థలం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కూల్చివేసి సుమారు వెయ్యిగజాల మేర లో పలికి జరిపి కొత్త గోడ నిర్మిస్తున్నారని ఆరో పించారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దా ర్‌ ఇబ్రహీం, ఎంఈవో శంకర్‌నాయక్‌, ఎంపీడీ వో గాలియాదయ్యలకు వినతి పత్రాలు అందజే శారు. సర్పంచ్‌ వరలక్ష్మీ భర్త పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రహరీని కూల్చివేయడంతో పాటు పాఠశాల ఆవరణలోని టేకు, వేప చెట్లను నరి కేశారని ఆరోపించారు. ఈ విషయమై ప్రధానో పాధ్యాయుడు ధర్మేందర్‌రావును ప్రశ్నించగా ప నులు నిలిపివేస్తామని తిరిగి ప్రారంభించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పరమేశ్‌, చెన్నయ్య, ఎండీ.రుక్మాద్దీన్‌, వనం వీరస్వావి, సురేందర్‌గౌడ్‌, సురేష్‌ గౌడ్‌, చంద్ర య్య, భానుచందర్‌, శ్రీశైలం, కిరణ్‌కుమార్‌రెడ్డి, మాణిక్యరావు, అరవింద్‌, ప్రశాంత్‌గౌడ్‌, నబీ రసూల్‌, నవీన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:33 PM