Share News

kumaram bheem asifabad- భారంగా బడి ఫీజు

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:18 PM

తి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు రుసు ముల వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇష్టారీతిన ఏటా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తున్నాయి. దీంతో బడి ఫీజు తల్లిదండ్రు లకు భారంగా మారుతోంది. అధిక రుసు ముల నియంత్రణకు రాష్ట్ర విద్యాశాఖ తాజాగా జారీ చేసిన ఆదేశాలను ప్రైవేటు యాజమాన్యాలు బుట్టదాఖలు చేస్తున్నాయి. ఫీజుల వివరాలు, సౌకర్యాలపై ఇంటిగ్రే టెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంటు సిస్టం(ఐఎస్‌ఎంఎస్‌) తెలంగాణ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచిస్తే జిల్లాలోని ఏ ఒక్క పాఠశాల ముందుకు రాక పోవడం యాజమాన్యాల తీరుకు అద్దం పడుతోంది.

kumaram bheem asifabad- భారంగా బడి ఫీజు
లోగో

- ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు

- పుస్తకాల నుంచి పెన్సిళ్ల వరకు స్కూళ్లలోనే అమ్మకాలు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యో తి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు రుసు ముల వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇష్టారీతిన ఏటా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తున్నాయి. దీంతో బడి ఫీజు తల్లిదండ్రు లకు భారంగా మారుతోంది. అధిక రుసు ముల నియంత్రణకు రాష్ట్ర విద్యాశాఖ తాజాగా జారీ చేసిన ఆదేశాలను ప్రైవేటు యాజమాన్యాలు బుట్టదాఖలు చేస్తున్నాయి. ఫీజుల వివరాలు, సౌకర్యాలపై ఇంటిగ్రే టెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంటు సిస్టం(ఐఎస్‌ఎంఎస్‌) తెలంగాణ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచిస్తే జిల్లాలోని ఏ ఒక్క పాఠశాల ముందుకు రాక పోవడం యాజమాన్యాల తీరుకు అద్దం పడుతోంది. విద్యా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలల ఫీజుల వివరాలతో పాటు ఫైర్‌, సౌండ్‌, శానిటరి, ట్రాఫిక్‌ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచాల్సి ఉంటుంది.

- తల్లిదండ్రులకు అవస్థలు..

ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఫీజులు, ఇతరాల పేరిట చేస్తున్న వసూళ్లు తల్లిదండ్రు లకు ఆర్థిక భారంగా మారుతున్నాయి. మార్కెట్‌లో తమకు అనువైన చోట కొను గోలు చేయకుండా పాఠశాలలు సూచించిన పుస్తక, వస్త్ర దుకాణాల్లోనే పుస్తకాలు యూనిఫాంలు కొనుగోలు చేయాలని చెబుతున్నాయి. నిబంధనల మేరకు ఫీజుల పట్టిక ఏర్పాటు చేయడం లేదు. ఇలాంటి వాటిపై తల్లిదండ్రులు ఆయా పాఠశాలలపై ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. సెల్‌ ఫోన్‌ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌ నమోదు చేయగా వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే ఫిర్యాదు చేయాల్సిన అంశాలను చూపి స్తుంది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే ఉన్నతాధి కారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుం టున్నారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతి ఉన్న పాఠశాలలు 115 ఉన్నాయి. వీటిలో సుమారు 82 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఏ ఒక్కటీ కూడా వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అధిక ఫీజుల వసూళ్లకు నియంత్రణ చేయాలంటే వెంటనే ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానందంచారిని వివరణ కోరగా జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలకు ఇటీవలే నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అన్నారు. వారం రోజు ల్లోగా పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించామని చెప్పారు. లేని పక్షంలో పాఠశాలలపై శాఖ పరమైన చర్య లు తీసుకుంటామని వివరించారు.

Updated Date - Sep 25 , 2026 | 11:18 PM