kumaram bheem asifabad-మోగనున్న బడి గంట
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:32 PM
ఆట పాటలతో వేసవి సెలవులు సరదాగా గడిచి పోయా యి. ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారికి అవసరమైన పుస్తకాలు, డ్రెస్సులు కొనుగోలులో తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. వేసవంతా బోసిపోయిన స్కూళ్లు సోమవారం పునఃప్రారంభంతో మళ్లీ కళకళలాడనున్నాయి.
- ముగిసిన వేసవి సెలవులు
- ప్రారంభం కానున్న నూతన విద్యాసంవత్సరం
ఆసిఫాబాద్ జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆట పాటలతో వేసవి సెలవులు సరదాగా గడిచి పోయా యి. ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారికి అవసరమైన పుస్తకాలు, డ్రెస్సులు కొనుగోలులో తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. వేసవంతా బోసిపోయిన స్కూళ్లు సోమవారం పునఃప్రారంభంతో మళ్లీ కళకళలాడనున్నాయి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాల ఇబ్బందులు లేకుండా జిల్లా విద్యా శాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. పాఠ్య పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు సరఫరా చేసింది. వేసవి సెలవులను పిల్లలు బాగా ఆస్వాదించారు. ఆట పాటల్లో మునిగి తేలారు. అయితే వేసవి సెలవులు ఈనెల 12తో పూర్తికాగా వాతావరణ పరిస్థితుల దృష్టా సెలవులను మరో మూడు రోజులు పొడగిం చగా సోమవారం నుంచి విద్యార్థులు మళ్లీ బడిబ ాట పట్టనున్నారు. వారిని సిద్ధం చేసి బడికి పంపేందుకు తల్లిదండ్రులూ ఏర్పాట్లు చేసుకున్నా రు. సెలవులతో బోసి పోయిన పాఠశాలలు కళకళ లాడనున్నాయి.
- తప్పని పాత సమస్యలు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నేటినుంచి పునఃప్రారంభం కానున్నాయి. అయితే కొత్త విద్యా సంవత్సరంంలో విద్యార్థులకు పాత సమస్యలే స్వాగ తం పలకనున్నాయి. జిల్లా లోని చాలా బడుల్లో ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మూత్ర శాలలు, మరుగుదొడ్లు, ప్రహారీలు, వంట గదుల నిర్మాణాలు పూర్తికాలేదు. పాత మరుగుదొడ్లు, తరగ తి గదులు, వంటశాలలకు మరమ్మతులు చేప ట్టలేదు. ప్రహారీలు సైతం లేకపోవడంతో పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం బడుల కు వచ్చే విద్యార్థులకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 103, ప్రాథమికోన్నత పాఠశాలలు 106, ప్రాథమిక పాఠశాలలు 833 ఉన్నాయి. ఇందులో 62,315 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 2072 మంది ఉఫాధ్యాయులు పనిచేస్తున్నా రు. అయా పాఠశాలల భవనాలు చాలా చోట్ల శిధిలావస్థకు చేరాయి. అదనపు తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన మరుగు దొడ్ల పనులు కూడా పూర్తి కాలేదు. జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 459 పాఠశాల ల్లో అదనపు మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పనులు ప్రారం భించారు. ఇప్పటివరకు 218 పూర్తి కాగా మరో241 నిర్మాణ దశలోనే ఉన్నాయి.
- పాఠ్యపుస్తకాలు రాక..
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో పాఠశాలలు ప్రారంభమై నెల లు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యప ుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండే ళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో పాఠ్య పుస్తకాలను అందజేస్తోంది. సబ్జెక్ట్ పుస్తకాల కొరత తలెత్తకుండా అదిగమించడానికి ప్రత్యేక చొరవ తీసుకొని మందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న విద్యార్థులకు 3,39,170 పుస్త కాలు అవసరమని అధికారులు ప్రణాళికలు రూపొందిం చారు. ఇప్పటి వరకు 2,82,435 పుస్తకాలు రాగా వా టిని గోదాంలో భద్రపరిచి ఆయా పాఠశాలలకు సరఫరా చేశారు. అలాగే పేద, మధ్య తరగతి కు టుంబాల వారి పిల్లలకు నోట్‌బుక్స్ కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితం గా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది నుంచి పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలను అందిస్తోంది. కాగా విద్యార్థులకు పంపిణీ చేయల్సిన యూనిఫాం ఇంకా సిద్ధం కాలేదు. దీంతో పాత దు స్తులతోనే పాఠశాలకు రావల్సిన పరిస్థితి నెలకొన్నది.