Share News

పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:09 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సంజయ్‌ జాజు అన్నారు. శుక్రవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫ రెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు.

 పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సంజయ్‌ జాజు అన్నారు. శుక్రవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫ రెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌ లిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీ సుకోవాలన్నారు. వీబీజీరామ్‌జీ పథకం కింద చేపట్టే పనుల్లో నాణ్యత ప్ర మాణాలు పాటించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రభు త్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. చేయూత పింఛన్‌లు, తాగునీటి సరఫరా తదితర వాటిని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:10 PM