Share News

kumaram bheem asifabad-ఉపాధి కరువు

ABN , Publish Date - Aug 30 , 2026 | 10:55 PM

వాంకిడి మండల కేంద్రంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ) ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. దీంతో పనులు లేక కార్మికులకు ఉపాధి కరువైంది. దీంతో కుటుంబాల పోషణకు కార్మికులు ఇబ్బందు లు పడుతున్నారు. గతంలో 60 మందికి పైగా కార్మికులకు ఉపాధినందించిన ఈ పరిశ్రమ నేడు పనులు లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తోంది. రాష్ట్రంలో 1971లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 56 సీఎఫ్‌సీ (కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌) కేంద్రాలను ప్రారంభించారు. అందులో భాగంగానే అప్పటి తాలుకా కేంద్రమైన వాంకిడిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు

kumaram bheem asifabad-ఉపాధి కరువు
వాంకిడి సీఎఫ్‌సీ

- ప్రభుత్వ ఆర్డర్లు లేక కార్మికుల ఇబ్బందులు

- ఉన్నతాధికారులు చొరవ చూపాలని వినతి

వాంకిడి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ) ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. దీంతో పనులు లేక కార్మికులకు ఉపాధి కరువైంది. దీంతో కుటుంబాల పోషణకు కార్మికులు ఇబ్బందు లు పడుతున్నారు. గతంలో 60 మందికి పైగా కార్మికులకు ఉపాధినందించిన ఈ పరిశ్రమ నేడు పనులు లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తోంది. రాష్ట్రంలో 1971లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 56 సీఎఫ్‌సీ (కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌) కేంద్రాలను ప్రారంభించారు. అందులో భాగంగానే అప్పటి తాలుకా కేంద్రమైన వాంకిడిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కలపతో అందమైన వస్తువులు తయారు చేయడంలో ఇక్కడి కార్మికులు ప్రతిభ చూపారు. భవనాలకు అమర్చే తలుపులు, కిటికీలు, టేబుల్లు, సోఫాసెట్లు, రాకింగ్‌ చైర్లు, డైనింగ్‌ టేబుల్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌, తదితర వస్తువులు తయారు చేస్తారు. కలపతో ఫర్నిచరే కాకుండా ఇనుముతో బీరువాలు, బెడ్‌లు, డ్యుయల్‌ డెస్క్‌లు తదితర వస్తువులు తయారుచేస్తుంటారు. ప్రస్తుతం కలప లభ్యం కాకపోవడంతో ఇనుముతోనే వస్తువులను తయారు చేస్తున్నారు. 1980లో ఈ సంస్థను ఐటీడీఏ ఆధీనం లో తీసుకుని నిరుద్యోగ గిరిజన యువతకు కర్రతో ఫర్నిచర్‌ తయారీలో శిక్షణ ఇవ్వడం ప్రారంభిం చారు. యువతకు శిక్షణతోపాటు ఉపాధి అవకాశం కల్పించాన్న ఉద్దేశంతో 1987-88లో ఐటీడీఏ ఆధ్వ ర్యంలో కార్మికుల సౌకర్యార్థం షెడ్లు, భవనాలు నిర్మించారు ఫర్నిచర్‌ తయారీకి అవసరమైన పరికరాలను సమకూర్చి ఆధునీకరించారు. 1991 నాటికి 335 మందికి వృత్తి శిక్షణ ఇచ్చారు.

- కలప కొరతతో..

కాలక్రమేణా కలప కొరత ఏర్పడడంతో 1998-99 లో మెటల్‌ వర్క్స్‌తో తయారు చేయడం ప్రారంభించారు. సీఎఫ్‌సీ పనితనాన్ని గుర్తించిన అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సుకుమార్‌ ఈ సంస్థ అభివృద్ధికి 14 లక్షల రూపాయలను మంజూరు చేశారు. అనతంరం కొంత మంది అప్పటి ఐటీడీఏ అధికారులు ఆర్థిక సహాయం అందిచడంతో ఆధునిక యంత్రాలను సమకూర్చారు. 2012లో పనులు లేక ఈ పరిశ్రమ సంక్షభంలో చిక్కుకుంది. అప్పటి నుంచి జూలై 2015 వరకు పరిశ్రమ మూతపడింది. అనంతరం అప్పటి ఐటీడీఏ పీవో ఆర్‌వీ కర్ణన్‌ సీఎఫ్‌సీని సందర్శించి పరిశ్రమను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఆరు లక్షల రూపాయల కార్పస్‌ నిధులను మంజూరు చేసి తిరిగి సీఎఫ్‌సీని పునఃప్రారంభించారు. తరువాత ప్రభుత్వ అర్డర్లు లేకపోవడంతో తిరిగి పరిశ్రమ మూతపడింది. మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ 4.5 లక్షల రూపాయల విలువ గల బెంచీలు తయారు చేసేందుకు ఆర్డర్‌ ఇవ్వడంతో కొన్ని నెలల పాటు పరిశ్రమ కొనసా గింది. తరువాత ఆర్డర్లు లేక తిరిగి మళ్లీ మూత పడింది. ఆ తరువాత ఐటీడీఏ పీవోగా పనిచేసిన వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌గా పనిచేసిన చాహత్‌ బాజ్‌పాయ్‌ ప్రత్యేక చొరవ తీసుకొని మూడు లక్షల రూపాయలు విలువ చేసే కలప తయారికి ఆర్డర్‌ ఇవ్వడంతో పరిశ్రమ తిరిగి తెరుచుకుంది. అనంతరం బెంగుళూరుకు చెందిన బెల్‌ (భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌) కంపెనీ నుంచి 34 లక్షల రూపాయలు విలువ చేసే 500 డ్యూయల్‌ డెస్క్‌లు ఆర్డర్‌ రావడంతో తిరిగి పరిశ్రమ గాడిన పడింది. అనంతరం పెద్దపల్లి జిల్లా నుంచి రూ. 13 లక్షల పనులకు ఆర్డర్లు రావడంతో పనులు కొనసాగాయి. ప్రస్తుతం ఆర్డర్లు లేకపోవడంతో గత ఏడాది నుంచి కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినట్లైతే సీఎఫ్‌సీకి పూర్వవైభవం రానుంది.

ప్రభుత్వ ఆర్డర్లతోనే మనుగడ..

- రాము, కార్మికుడు

పరిశ్రమ ప్రధానంగా ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి మనుగడ కొనసాగిస్తోంది. ఆర్డర్లు ఉన్న సమయాల్లో కార్మికులకు ఉపాధి ఉంటుంది. పను లు లేని సమయంలో కార్మికులకు కుటుంబ పోషణ సైతం భారంగా మారింది. ఈ పరిశ్రమపై ఆధా రపడి ఉన్న మాకు ప్రస్తుతం పనులు లేక ఆర్థికం గా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆర్డర్లు అందించి కార్మికులను ఆదుకోవాలి.

ఉపాధి కరువైంది..

- మడావి పైకాజీ, సీఎఫ్‌సీ ఇన్‌చార్జి

సీఎఫ్‌సీకి ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో ఉపాధి కరువైంది. గతంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫర్నిచర్‌ ఆర్డర్లు వచ్చేవి. దీంతో 60 మంది కార్మికులకు ఉపాధి ఉండేది. గతేడాది వరకు అధికారులు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వడంతో పనులు సాగాయి. ప్రస్తుతం ఆర్డర్లు లేక పోవడంతో పను లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆ ర్డర్లు లభించేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలి.

Updated Date - Aug 30 , 2026 | 10:55 PM