Share News

ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు ఆందోళనకరం

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:32 AM

క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారత సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు ఆందోళనకరం

  • ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలి: సీపీఎం

న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై భారత సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడంతో తాము ఏకీభవించడం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘షెడ్యూల్డ్‌ కులాలకు కల్పించిన రిజర్వేషన్లు, ఇతర రక్షణలు వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. అయితే, ప్రస్తుత తీర్పు సామాజిక-ఆర్థిక అంశాల కంటే మతపరమైన గుర్తింపునకే ప్రాధాన్యం ఇస్తోంది. అందువల్ల, ప్రస్తుత ఉత్తర్వును పరిశీలించి, సవరించడానికి రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలి’’ అని సీపీఎం పేర్కొంది. గుళ్లలోకి రానివ్వనందుకే దళితులు చర్చిలకు వెళుతున్నారని కుల వివక్ష పోరాట సమితి తెలంగాణ కార్యదర్శి మాల్యాద్రి అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు.

Updated Date - Mar 26 , 2026 | 04:32 AM