ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్!
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:57 AM
ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం తనకు కేటాయించే భూమిలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తున్నట్లు సమాచారం. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని 5 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వంతో..
హైదరాబాద్, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం తనకు కేటాయించే భూమిలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తున్నట్లు సమాచారం. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని 5 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న వివాదం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూకేటాయింపులకు గత నెల 30న ఎస్‌బీఐ బోర్డు అంగీకరించడంతో సమస్య ఇక సద్దుమణగనుంది. అయితే, నాలెడ్జ్ సిటీలో ఐదెకరాలకు బదులుగా 2.5ఎకరాలు, ఫ్యూచర్ సిటీలో 7-8 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించగా..ఎస్‌బీఐ మాత్రం ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్‌కు 10 ఎకరాల భూమి ఇవ్వాలని కోరింది. ప్రభుత్వంతో నెలకొన్న వివాదం ఈ విధంగా ముగింపు దశకు చేరుతున్న దరిమిలా ఎస్‌బీఐ తన పిటిషన్‌ను కోర్టు నుంచి ఉపసహరించుకునే కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఈ నెల 9న హైకోర్టులో అఫిడవిట్ వేయనుందని సమాచారం.