చెరువును కాపాడి.. ఉపాధి కల్పించండి
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:14 PM
కాసీపేట మండలం లంబాడితండా గ్రామంలో తరతరాల నుంచి చెరువు ద్వారా తాము ఉపాధి పొందుతున్నా మని, ఇతరులు తమ ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నయని ఆవేదన చెందిన పలువురు గ్రామస్తులు మంగళవారం నస్పూర్‌లోని కలె క్టరేట్ ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు.
కలెక్టరేట్ ఎదుట లంబాడితండా వాసుల దర్నా
నస్పూర్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : కాసీపేట మండలం లంబాడితండా గ్రామంలో తరతరాల నుంచి చెరువు ద్వారా తాము ఉపాధి పొందుతున్నా మని, ఇతరులు తమ ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నయని ఆవేదన చెందిన పలువురు గ్రామస్తులు మంగళవారం నస్పూర్‌లోని కలె క్టరేట్ ఎదుట గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మా ట్లాడుతూ యాబైఏళ్లుగా చెరువును లీజుకు ఇచ్చి గ్రామ వాసులం జీవనో పా ధిని పొందుతున్నామన్నారు. కానీ గ్రామ సభ పెట్టకుండ తీర్మానం లేకుండా స్వంత ప్రయోజనాల కోసం కొందరు వారి పేర్లను రిజిస్ర్టేషన్ చేయించు కున్నారన్నారు. ఈ విషయాన్ని మత్య్స శాఖ అధికారి దృష్టికి తెచ్చిన కూడా ఏలాంటి స్పందన లేదన్నారు. లంబాడితండా చెరువు, శిఖంను కాపాడి జీవ నోపాధి కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అజ్మీరా గణేష్, రాజు, తిరుపతి, రాజు నాయక్, జగనంద్ పాల్గొన్నారు.