Share News

kumaram bheem asifabad- సర్వేలతో సతమతం

ABN , Publish Date - Jul 21 , 2026 | 10:39 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చిన్న సర్వే చేపట్టినా..లేదా ఏదైనా పథకాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలన్నా అంగన్‌వాడీ టీచర్లనే నమ్ముతున్నాయి. కుటుం బ సమగ్ర సర్వే, బడిబాట, హెల్త్‌ క్యాంపులు, ప్రజాపాలన వంటి పనులతో ఇప్పటికే సతమతమవుతున్న టీచర్లకు తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)బాధ్యతలు అదనపు భారాన్ని మోపుతున్నాయి.

kumaram bheem asifabad- సర్వేలతో సతమతం
లోగో

- యాప్‌లో సమస్య వస్తే రేయింబవళ్లు శ్రమించాల్సిందే

బెజ్జూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ చిన్న సర్వే చేపట్టినా..లేదా ఏదైనా పథకాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలన్నా అంగన్‌వాడీ టీచర్లనే నమ్ముతున్నాయి. కుటుం బ సమగ్ర సర్వే, బడిబాట, హెల్త్‌ క్యాంపులు, ప్రజాపాలన వంటి పనులతో ఇప్పటికే సతమతమవుతున్న టీచర్లకు తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)బాధ్యతలు అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఈ అదనపు బాధ్యతల వల్ల అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కుంటుపడుతుండడంతో టీచర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

- బీఎల్‌వోగా..

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వో లు)గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా 15మండలాల్లో 335గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో మ్యాపింగ్‌ కోసం టీచర్లతో పాటు ఆర్‌పీలను వినియోగిస్తున్నారు. గత నెల 25న ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో అంగన్‌వాడీ టీచర్లు కేంద్రాల కంటే సర్వే పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. ఉదయం చిన్నారులు, గర్బిణుల హాజరు నమోదు చేసిన వెంటనే ఎస్‌ఐఆర్‌ విధుల్లోకి వెళ్లాల్సి వస్తుండ డంతో కేంద్రాల నిర్వహణ అంతా హెల్పర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలో మొత్తం 1006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. 165అంగన్‌వాడీ టీచర్లు, 447ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు సర్వే పనుల్లో బిజీగా ఉండటం, హెల్పర్లు లేనిచోట్ల కేంద్రాలు నామమాత్రంగా నడుస్తుండటంతో చిన్నారులు, బాలింతలు, గర్బిణీలకు అందాల్సిన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పోషకాహారం పంపిణీ, ఆటపాటలు, ఆరోగ్య సంరక్షణ వంటి కనీస సేవలు కూడా సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. కాగాయాప్‌లో వివరాల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే టీచర్లు రేయింబవళ్లు శ్రమిం చాలి. ఉదయం కేంద్రాల్లో పనులు, సాయంత్రం వరకు సర్వే ఫారాలు నింపడం, యాప్‌లో వివరాలు నమోదుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవు ున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాలకు అంగన్‌వాడీ టీచర్లకే బాధ్యతలు అప్పగిస్తుండడంతో ఒత్తిడికి గురవుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. అటు ప్రభుత్వ పథకాలతో, ఇటు కేంద్రాల పనులతో సతమతమవుతున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 10:39 PM