Share News

రూఫ్‌సింగ్‌తండా ఘటనలో సర్పంచ్‌, కుమారుడు చికిత్స పొందుతూ మృతి

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:59 AM

ఆస్తి కోసం కన్న తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లీకొడుకులు మృతి చెందారు.

రూఫ్‌సింగ్‌తండా ఘటనలో సర్పంచ్‌, కుమారుడు చికిత్స పొందుతూ మృతి

పరిగి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం కన్న తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లీకొడుకులు మృతి చెందారు. ఈనెల 24న వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రూఫ్‌సింగ్‌తండా సర్పంచ్‌ రమణిబాయి కుటుంబంపై సవతి కుమారుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు అనార్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్‌ రమణిబాయి, ఆమె కుమారుడు వెంకటేశ్‌ ఆదివారం మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రమణిబాయి భర్త హన్మంత్‌ పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 04:59 AM