Santoor Muthyala Muggula: ఇలపై ఇంద్రధనుస్సులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:52 AM
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై సన్‌ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు... టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా. ప్రేయర్ పార్టనర్ పరిమళ్...
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై సన్‌ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు... టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా. ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్‌వాసీ అగర్‌బత్తి) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా జరిగాయి. 12 వేల మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొని తమ రంగవల్లులతో సంక్రాంతి శోభను ఇనుమడింపజేశారు. ప్రతి కేంద్రంలో ప్రథమ బహుమతి రూ.6,000, ద్వితీయ బహుమతి రూ.4,000, తృతీయ బహుమతి రూ.3,000తోపాటు అనేక కన్సొలేషన్ బహుమతుల్ని మహిళలు గెల్చుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంఽఽధ్రప్రదేశ్‌లోని 28 జిల్లాలు, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఎంపికైన 30 మంది మహిళలకు ఈ నెల 10న విజయవాడలో ఫైనల్ పోటీలు జరుగుతాయి. అలాగే తెలంగాణలోని 33 జిల్లాల నుంచి ఎంపికైన 33 మంది మహిళలకు ఈ నెల 12న హైదరాబాద్‌లో ఫైనల్స్ జరుగుతాయి. ఫైనలిస్టులకు రూ.2,40,000కు పైగా బహుమతులు, ఇంకా గిఫ్ట్ హ్యాంపర్లు లభిస్తాయి.