Share News

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:00 AM

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌ జాజు బాధ్యతల స్వీకరణ

  • శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సీఎస్‌ కే రామకృష్ణారావు నుంచి ఆయన చార్జి తీసుకున్నారు. రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తో ముగియడంతో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజును రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఎంసీహెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సంజయ్‌ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సీఎస్‌ జాజుకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేసిన సంజయ్‌ ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చారు. సచివాలయంలో జరిగిన బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రామకృష్ణారావు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 07:03 AM