పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి
ABN , Publish Date - May 29 , 2026 | 11:26 PM
గ్రామాల్లో ప్రతిరోజు పారిశుధ్య్ద పనులను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెం కటేశ్వర్‌రావు సూచించారు. శుక్రవారం పెద్దంపేట, దొనబండ గ్రామా ల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు.
డీపీవో వెంకటేశ్వర్‌రావు
హాజీపూర్, మే 29 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రతిరోజు పారిశుధ్య్ద పనులను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెం కటేశ్వర్‌రావు సూచించారు. శుక్రవారం పెద్దంపేట, దొనబండ గ్రామా ల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ ప్రతిరోజు మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేయా లన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా చూడాలన్నారు. జల్ భగీ దారి సర్వేనే వేగవంతం చేయాలని, పెద్ద గ్రామపంచా యతీలో రోజుకు 200, చిన్న గ్రామపంచాయతీలో రోజుకు 100 స్ట్ట్రక్చర్స్‌ను క్యా ప్చర్ చేయాలని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో సుమన్, సర్పంచు వెంకటేష్, కార్యదర్శులు రూపాదేవి, నరేందర్‌లు ఉన్నారు.