పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:32 PM
గ్రామాల్లో ప్రతి రోజు పారిశుధ్య్ద పనులను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని సాలిగాం గ్రామంలో పర్యటించారు. పారిశుధ్య్ద పనులను పరిశీలించారు.
జిల్లా అదనపు కలెక్టర్
కన్నెపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో ప్రతి రోజు పారిశుధ్య్ద పనులను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని సాలిగాం గ్రామంలో పర్యటించారు. పారిశుధ్య్ద పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు మురుగుకాలువలు, రోడ్లను శుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలన్నారు. ఉపాధి హమీ పనులను పరిశీలించి కూలీలకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూలీలకు అందజేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం పనులకు హాజరు కావాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరై ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. మొదటిసారిగా పంచాయతీకి వచ్చిన అదనపు కలెక్టర్ చంద్రయ్యను, డీపీవో వెంకటేశ్వర్‌రావును సర్పంచు ప్రభాకర్, వార్డు సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో రమ్య, ఏపీవో శ్రీనివాస్, కార్యదర్శి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.