ప్రతి రోజు పారిశుధ్య పనులను చేపట్టాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:59 PM
గ్రామాల్లో ప్రతీ రోజు పారిశుద్య ప నులను చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించా రు. గురువారం మండలంలోని రాపల్లి గ్రామంలో ఆకస్మకంగా పర్యటించారు.
డీపీవో వెంకటేశ్వర్‌రావు
హాజీపూర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో ప్రతీ రోజు పారిశుద్య ప నులను చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు సూచించా రు. గురువారం మండలంలోని రాపల్లి గ్రామంలో ఆకస్మకంగా పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎక్క డా రోడ్లపై చెత్తా, చెదారం, ప్లాస్టిక్ లేకుండా చూడాలన్నారు. వర్షాకాలం దృ ష్య్టా ఇళ్ల పరిసరాల్లో, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్ తయారు చేసి వేయాలన్నారు. 15వ ఆర్ధిక సం ఘం నిధులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఖర్చు చేయాలన్నారు. అనంత రం రికార్డులను పరిశీలించి ఎప్పటి కప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించా రు. ఎంపీవో సుమన్, సర్పంచు రాంరెడ్డి, కార్యదర్శి శ్రీలత ఉన్నారు.