Share News

kumaram bheem asifabad- వారం రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:21 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లో సచివాలయం నుంచి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, సంక్షేమ శాఖాధికారులతో ఏడు రోజుల పాటు ప్రభుత్వం సంక్షేమ విద్యాలయాలు, వసతి గృహాలలో నిర్వహించనున్న సంక్షేమ వారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- వారం రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లో సచివాలయం నుంచి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, సంక్షేమ శాఖాధికారులతో ఏడు రోజుల పాటు ప్రభుత్వం సంక్షేమ విద్యాలయాలు, వసతి గృహాలలో నిర్వహించనున్న సంక్షేమ వారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు ఏడు రోజుల పాటు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనకబడి తరగతులు, మైనార్టీ గురుకులాల్లో వంట గదులు, విద్యాలయాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్‌, విద్య, విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్‌ నిర్వహించాలన్నారు. వసతి గృహాలలో మైనర్‌ మరమ్మతు పనులను చేపట్టాలని సూచించారు. విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వేసవి శిబిరం, బడి బాట కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 26 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏడు రోజుల పాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాల్లో వంట గది, పారిశుధ్య, మరమ్మతు పనులు చేపడుతామని తెలిపారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, జిల్లా సంక్షేమాధికారి నదీమ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:21 PM