పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:17 PM
జిల్లాలో పారిశుధ్య్ద నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పారిశుధ్య్ద నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ అన్ని గ్రామాల్లో పారిశుధ్య్ద నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు రోజువారీగా పర్యవేక్షించాలన్నారు. మురుగు కాలువలు, డంపింగ్‌యా ర్డులు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణతో పాటు వంద శాతం పారిశుధ్య్దం నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పం చాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని గ్రామాల్లో మంజూరు కాబడిన ఇందిరమ్మ ఇళ్లను గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో వంద శాతం పన్నులను వసూలు చేయాలని, గ్రామాల్లోని ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్క రించాలన్నారు. ఈ నెల 23 నుంచి ఒక ప్రత్యేక అధికారి, తహసీల్దార్, మండల వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గ్రామపంచాయతీ నిర్వహణ సరిగ్గా లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జెడ్పీ సీఈవో గణపతి, డీఆర్‌డీవో కిషన్ పాల్గొన్నారు.