స్థానికుల అవసరాలు తీర్చేందుకే ఇసుక రీచ్‌లు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:06 AM
స్థానికుల అవసరాలు తీర్చేందుకే ఇసుక రీచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌వెంక టస్వామి అన్నారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి
కోటపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : స్థానికుల అవసరాలు తీర్చేందుకే ఇసుక రీచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌వెంక టస్వామి అన్నారు. సోమవారం మండలంలోని కొల్లూరు గ్రామం లో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఇసుక రీచ్‌ను ఆయన ప్రారంభించారు. మంత్రి మా ట్లాడుతూ తక్కువ ధరకు గోదావరి ఇసు కను అందించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇ సుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీ సు కుంటామని, ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో మన ఇసుక వాహనం వెబ్‌సైట్ ద్వారా ఇసుకను బు క్ చేసుకున్న వినియోగదారులకు తక్కువ ధ రలకు అధికారికంగా ఇసుకను అందిస్తామ న్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ లలో జీపీఎస్, డ్రోన్, శాటిలైట్‌ల ద్వారా ఇసుక తవ్వ కాలు, రవాణా వ్యవస్థపై పర్యవేక్షణ ఉం టుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అభి వృద్ధి నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అంది స్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇం దిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ, సన్నబి య్యం పంపిణీ ఇతర పథకా ల ను అర్హులైన లబ్ధిదారులకు అం దేలా అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమన్వయంతో కృషి చే యాలన్నారు. ముల్కల్ల ఇసుక రీచ్ నుంచి మందమర్రి, క్యాత నపల్లి, ఇందారం ఇసుక రీచ్ నుంచి జైపూర్, భీమారం, కొల్లూ రు ఇసుక రీచ్ నుంచి కోటప ల్లి, చెన్నూరు, వేమనపల్లి ప్రాం తాలకు నిబంధనల ప్రకారం ఇ సుక అందిస్తామని ఈ క్రమం లో ట్రాక్టర్లు, రైతు పొలాల నుం చి సంబంధిత రైతుకు నష్టపరిహారం అంది స్తామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక రవా ణాకు పాల్పడితే మొదటిసారి జరిమానా, రెం డవ సారి వాహనం సీజ్ చేయడం ఉంటుం దన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, మైనింగ్ ఎండీ జగ న్‌మోహన్‌రావు, తహసీల్దార్ రాఘవేంద ర్‌రా వు, ఎంపీడీవో నాగే శ్వర్‌రెడ్డి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరిస్తా
చెన్నూరు : చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాన ని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. సోమవారం మున్సిపాలిటీలోని 1,2 వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజలను సమ స్య లు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ వార్డుల్లో పారిశుధ్య్ద పనులను ప్రతి రోజు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.