Share News

kumaram bheem asifabad- సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యాచరణ రూపొందించాలి

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:07 PM

సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యచరణ రూపొందించాలని నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం అన్నారు. న్యూఢిల్లీ నుంచి శుక్రవారం నీతి ఆయోగ్‌ ఇతర అధికారులతో కలిసి దేశంలోని 112 జిల్లాలు 513 బ్లాక్‌ అధికారులు, కలెక్టర్‌లు, విద్య, వైద్య, వ్యవసాయ, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు

kumaram bheem asifabad- సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యాచరణ రూపొందించాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యచరణ రూపొందించాలని నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం అన్నారు. న్యూఢిల్లీ నుంచి శుక్రవారం నీతి ఆయోగ్‌ ఇతర అధికారులతో కలిసి దేశంలోని 112 జిల్లాలు 513 బ్లాక్‌ అధికారులు, కలెక్టర్‌లు, విద్య, వైద్య, వ్యవసాయ, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్‌ 2.0 పథకం కార్యచరణ ప్రణాళిక జనవరి 28 నుంచి ఏప్రిల్‌ 14 వరకు చేపట్టాలని చెప్పారు. ఈ పథకం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 మధ్య ప్రారంభమవుతుందని తెలిపారు. సంపూర్ణత అభియాన్‌ పథకం కింద విద్య, వైద్య, పిల్లలకు, గర్భిణులకు పోషక ఆహారం, చిన్న పిల్లల ఆరోగ్యం, పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు, వ్యవసాయాధిరిత భూసార పరీక్షలు, పశువులకు టీకాలు వంటి కార్యక్రమాలు 90 రోజుల పాటు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వయం సహాయ సంఘాల మహిళలను భాగస్వాములు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట భవన సముదాయంలో గల వీసీ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ హరిత అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్‌ 2.0 పథకంలో భాగంగా జనవరి 28 నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌, జిల్లా బ్లాక్‌లో కార్యక్రమాలు చేపడు తామని చెప్పారు. ఇందులో అందరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా వైద్యాధికారి సీతారాం, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, నీతి అయోగ్‌ సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:07 PM