కేటీఆర్ చిల్లర రాజకీయాలు మానాలి: సంపత్
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:08 AM
నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా వక్రీకరించడం కేటీఆర్‌కు అలవాటని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ధ్వజమెత్తారు....
హైదరాబాద్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా వక్రీకరించడం కేటీఆర్‌కు అలవాటని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీని ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరించి పచ్చి అబద్ధాలను ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంపత్‌కుమార్ మాట్లాడారు. ‘‘ఒక ప్రధానికి మనుమడు, మరో ప్రధానికి కొడుకైన రాహుల్‌గాంధీకి ఇంతవరకు సొంత ఇల్లు కూడా లేదు. ఆయనకు ఆస్తులే కావాలనుకుంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకున్నా రూ.వెయ్యి కోట్లవుతాయి’’ అన్న రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇలా మాటలను వక్రీకరించే నీచ, చిల్లర రాజకీయాలను కేటీఆర్ మానుకోవాలని సంపత్‌కుమార్ అన్నారు.