Share News

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

ABN , Publish Date - May 24 , 2026 | 04:32 AM

ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరంలో కొత్త కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్(టిస్‌) సహకారంతో ఈ కోర్సులను అందిస్తోంది. బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌), బీఎస్సీ(హానర్స్‌-కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డేటా అనలిటిక్స్‌)లో ప్రవేశానికి ఇంటర్‌ ఎంపీసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని, అదే బీఎస్సీ(హానర్స్‌- మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌)లో ప్రవేశానికి ఇంటర్‌లో ఎంఈసీ లేదా ఎంపీసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని వర్సిటీ పేర్కొంది. ఎంఏ(పబ్లిక్‌ పాలసీ- గవర్నెన్స్‌-డెవల్‌పమెంట్‌ స్టడీస్ )లో ఏదేనీ డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని సూచించింది. ఇప్పటికే ఉన్న బీఎస్సీ(హానర్స్‌/ఎకనామిక్స్‌)లో ప్రవేశానికి ఇంటర్‌లో ఏదేనీ గ్రూప్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని వర్సిటీ పేర్కొంది. మరిన్ని వివరాలకు 73824 37384(వినీత్‌), 93478 09918(సాయి) ఫోన్‌ నంబర్లలో లేదా ఠీఠీఠీ.టటఛ్టిఠ.్చఛి.జీుఽ అనే వెబ్‌సైట్‌లో లేదా ్చఛీఝజీటటజీౌుఽటఃటటఛ్టిఠ.్చఛి.జీుఽ ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

Updated Date - May 24 , 2026 | 04:32 AM