మధుపార్క్ అపార్ట్‌మెంట్ వాసులకు..
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:19 AM
పైసా పైసా కూడబెట్టి మధుపార్క్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారి బాధను ప్రభుత్వం అర్థం చేసుకుందని, వారికి చదరపు అడుగుకు...
చదరపు అడుగుకు 5 వేల చొప్పున పరిహారం
సామా రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పైసా పైసా కూడబెట్టి మధుపార్క్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారి బాధను ప్రభుత్వం అర్థం చేసుకుందని, వారికి చదరపు అడుగుకు రూ. 5 వేల చొప్పున పరిహారం ఇవ్వడానికి ముందుకు వచ్చిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ ధరల ప్రకారం చదరపు అడుగు ధర రూ. 3 వేలు మాత్రమే ఉందని చెప్పారు. గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గాంధీ ప్రాజెక్టుకు, మధుపార్క్ అపార్ట్‌మెంట్‌కు సంబంధమే లేదని, ఆ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో నిర్మించారని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ అనవసరమైన రాద్దాంతం చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్ బాధితులను తరిమేందుకు ఊళ్లలోకి నీళ్లను వదిలారని ఆరోపించారు. ఇదే హరీశ్‌రావు.. ఆనాడు మల్లన్న సాగర్ బాధితులను కలిసేందుకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. మూసీ వరదల్లో హైదరాబాద్ ప్రజలను ముంచాలని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు.