Share News

సురక్షిత ప్రయాణమే శ్రేయస్కరం..

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:32 PM

ప్రతీ డ్రైవర్‌ ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలను నడిపి ప్రమాదాలను నివారిస్తూ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ అన్నారు. న స్పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సీసీసీలో రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌ ఆధ్వర్యంలో శనివారం ఆరైవ్‌ అలైవ్‌ ఫేజ్‌-0.3 రోడ్డు భద్రత అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు.

సురక్షిత ప్రయాణమే శ్రేయస్కరం..
సీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ భాస్కర్‌

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో డీసీపీ భాస్కర్‌

నస్పూర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ డ్రైవర్‌ ట్రాఫిక్‌ నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలను నడిపి ప్రమాదాలను నివారిస్తూ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ అన్నారు. న స్పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సీసీసీలో రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌ ఆధ్వర్యంలో శనివారం ఆరైవ్‌ అలైవ్‌ ఫేజ్‌-0.3 రోడ్డు భద్రత అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రై వర్లకు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమా దాల నివారణకు ట్రాఫిక్‌ నియమాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. డ్రైవర్లు దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో డ్రైవింగ్‌ను జాగ్రత్తగా చేయా లని సూచించారు. అలసట, నిద్ర సమస్య ఉన్నట్లయితే తప్పనిసరిగా విశ్రాం తి తీసుకోవాలన్నారు. విశ్రాంతి లేకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. వేగ పరిమితులను పాటిస్తూ సీటు బెల్ట్‌ ధరించాలని, వాహనాలను నడిపిస్తూ ఫోన్‌ మాట్లాడవద్దని సూచించారు. మ ద్యం సేవించి వాహనాలను రోడ్డుమీదకు తీసుకరావద్దన్నారు. రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తులను గోల్డెన్‌ అవర్‌లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను కా పాడిన వారికి ప్రభుత్వం రహవీర్‌ పథకం ప్రవేశపెట్టి ప్రోత్సహక బహుమతి అందిస్తుందన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్‌ నియమాలను, నిబంధనల ను పాటిస్తూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరాలన్నారు. అంతకు ముందు డ్రైవర్లకు సురక్ష కంటి వైద్య శాల ఆధ్వర్యంలోడాక్టర్‌ అభిషేక్‌ కంటి పరీక్షలు ని ర్వహించారు. అలాగే సీసీసీ కార్నర్‌ వద్ద చలివేంద్రాన్ని డీసీపీ ప్రారంభించా రు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌, సీసీసీ ఎస్‌ఐ మేకల ప్రశాంత్‌, నస్పూర్‌, మంచిర్యాల లారీ అసోసియేషన్‌ అధ్యక్షులు సదానందం, హుస్సేన్‌, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 10:32 PM