Share News

సాధ్వి నిరంజన్‌తో ఆర్‌. కృష్ణయ్య, కె. లక్ష్మణ్‌ భేటీ

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:10 AM

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సాధ్వి నిరంజన్‌ జ్యోతికి బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య, కె.లక్ష్మణ్‌, పాక సత్యనారాయణ...

సాధ్వి నిరంజన్‌తో ఆర్‌. కృష్ణయ్య, కె. లక్ష్మణ్‌ భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సాధ్వి నిరంజన్‌ జ్యోతికి బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య, కె.లక్ష్మణ్‌, పాక సత్యనారాయణ, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఢీల్లీలోని ఆమె నివాసంలో బీజేపీ ఎంపీలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ సామాజిక వర్గాల సంక్షేమం, సాధికారత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు చర్చించారు. సామాజిక న్యాయాన్ని పెంపొందించే దిశగా తోటి ఓబీసీ ఎంపీలతో కలిసి నిరంజన్‌ జ్యోతికి పూర్తి మద్దతును ప్రకటించామని కృష్ణయ్య, లక్ష్మణ్‌ తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 03:10 AM