Nirmal District: ప్రారంభానికి సిద్ధమైన సదర్‌మాట్ బ్యారేజీ
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:31 AM
నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై 18 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీ పనులన్నీ పూర్తయ్యాయి.
16న సీఎం చేతుల మీదుగా యాసంగికి నీటి విడుదల
నిర్మల్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై 18 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీ పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం యాసంగి పంటల కోసం సాగునీరు విడుదల చేయనున్నారు. బ్యారేజీ నుంచి నిర్మల్, జగిత్యాల జిల్లాలకు 18,120 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యారేజీ అంచనా వ్యయం రూ.676 కోట్లు కాగా, 1,170 ఎకరాల భూ సేకరణకు రూ.120 కోట్లను అందించారు.