Share News

దరఖాస్తుదారుడి అఫిడవిట్‌ చాలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:25 AM

సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూ భారతి చట్టం-2025 కింద ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ...

దరఖాస్తుదారుడి అఫిడవిట్‌ చాలు

  • సాదాబైనామాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూ భారతి చట్టం-2025 కింద ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆ వివరాలను పంపింది. దాని ప్రకారం.. గతంలో అమ్మిన వ్యక్తి నుంచి అఫిడవిట్‌ ఇవ్వాలన్న నిబంధనను మినహాయిస్తూ.. కొనుగోలుదారు నుంచి తీసుకోవాలని పేర్కొంది. 2020అక్టోబరు 12 నుంచి నవంబరు 10 మధ్యన వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలంది. హక్కుకల్పించే అర్హత, ఆక్రమణ, పొజిషన్‌లో ఉన్నవారి వివరాలను ఆర్డీవో పరిశీలించాలని సూచించింది. అర్హులైన దరఖాస్తుదారుల నుంచి అఫిడవిట్‌ సమర్పించాలని పొందుపర్చారు. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీలను గతంలో ఇచ్చిన జీవోల్లో సూచించిన మేరకే తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి నిర్ణీతకాలాన్ని నిర్దేశించారు. ఈ ప్రక్రియపై వారానికి ఒకసారి కలెక్టర్లు నివేదికలు పంపాలని సూచించింది. వీటన్నిటినీ భూ భారతి ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా నిర్వహించనున్నారు.

Updated Date - Apr 08 , 2026 | 05:25 AM