Share News

రైలులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:44 AM

శిరీష్ కుమార్‌ అనే ఓ వ్యక్తి రైలులో భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రైలులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

  • అకస్మాత్తుగా భార్య కనిపించడంతో అఘాయిత్యం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): శిరీష్ కుమార్‌ అనే ఓ వ్యక్తి రైలులో భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుంటూరుకు చెందిన శిరీ్‌షకుమార్‌ ప్రియురాలు నీలాదేవితో కలిసి సికింద్రాబాద్‌కు వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు. అదే రైలులో అతని భార్యను చూసి శిరీష్‌ అవాక్కయ్యాడు. దాంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ప్రేమజంట అపస్మారకస్థితిలోకి వెళ్లింది. రైలు సికింద్రాబాద్‌కు చేరుకోగానే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వారు అపస్మారకస్థితిలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పా రు. శిరీష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మాహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయని రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 05:45 AM