Share News

‘హైకోర్టు అడ్వకేట్స్‌’ అధ్యక్షుడిగా సురేందర్‌రెడ్డి

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:19 AM

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎస్‌.సురేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైకోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలను...

‘హైకోర్టు అడ్వకేట్స్‌’ అధ్యక్షుడిగా సురేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎస్‌.సురేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైకోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలను అదేరోజు రాత్రి ప్రకటించారు. సురేందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి చిక్కుడు ప్రభాకర్‌పై 275 ఓట్లతో ఘన విజయం సాధించారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా డి.ఎల్‌. పాండు, కార్యదర్శులుగా పి. శ్రవణ్‌కుమార్‌గౌడ్‌, కె. నిరంజన్‌రెడ్డి, మహిళా రిజర్వుడు జాయింట్‌ సెక్రటరీగా పి. కృష్ణకీర్తన, ట్రెజరర్‌గా బానోత్‌ బాలాజీ, క్రీడలు- సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా జయసూర్య విష్ణువర్ధన్‌ సహా మరో ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా ఎన్నికయ్యారు. 25 ఏళ్ల సీనియార్టీ ఉన్న ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కోటాలో నాగులూరి కృష్ణకుమార్‌గౌడ్‌ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - Mar 27 , 2026 | 04:19 AM