వేములవాడలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:33 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి క్షేత్రం కార్తీక దీపాలతో సోమవారం దేదీప్యమానమై కనువిందు చేసింది. మంగళవారం కార్తీక పౌర్ణని పురష్కరించుకుని సోమవారం భీమన్న ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారు జామున భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, పవిత్రస్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం
వేములవాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి క్షేత్రం కార్తీక దీపాలతో సోమవారం దేదీప్యమానమై కనువిందు చేసింది. మంగళవారం కార్తీక పౌర్ణని పురష్కరించుకుని సోమవారం భీమన్న ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారు జామున భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, పవిత్రస్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్లలో భక్తులు సుమారుగా మూడు గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. శీఘ్రదర్శనం, బ్రేక్దర్శనం క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీస్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకుని తరించారు. ఆలయ ఆవరణలోని గండాదీపంలో నూనే పోస్తూ గండాలు తొలగాలని, గాయాత్రీ మాత ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. కార్తీక దీపాలు వెలిగించి సుమంగళిగా ఉండేలా దీవించాలని శివకేశవులను వేడుకున్నారు. నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం, ఛండీహోమంలో పాల్గొన్నారు. నిత్యన్నదాన సత్రంపైన ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో శివకళ్యాణంలో పాల్గొన్న భక్తులు అర్చకులు చేపట్టిన శివకళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. కాగా ఆలయంలో ఈవో రమాదేవి ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక కార్తీక దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక సోమవారం కావడంతో మంగళవారం కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు సుమారుగా ఒక లక్ష వరకు వచ్చినట్లు ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివసాయి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి నిత్యన్నదాన సత్రానికి ఆస్ర్టేలియాలో స్థిరపడిన హైదరాబాద్కు చెందిన యక్ష ప్రణయ్ కుమార్రెడ్డి రూ. 35 వేల 16 విరాళం అందించారు.
ఘనంగా మహాలింగార్చన
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు అంతరంగీకంగా చేపట్టారు. కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని ఉదయం శ్రీస్వామి వారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో ఆలయ అర్చకులు లింగాకృతిలో 365 దీపాలను వెలిగించి వేదమంత్రోచ్చరణల మధ్య మహాలింగార్చన చేపట్టారు.