Share News

ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి విలువ పతనం

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:52 AM

రూపాయి విలువ పతనం మీద ఆర్బీఐగానీ అధికార, ప్రతిపక్షాలు గానీ మాట్లాడడం లేదని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు ఆచార్య నరసింహారెడ్డి విమర్శించారు.

ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి విలువ పతనం

  • ఆచార్య డి.నరసింహారెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రూపాయి విలువ పతనం మీద ఆర్బీఐగానీ అధికార, ప్రతిపక్షాలు గానీ మాట్లాడడం లేదని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు ఆచార్య నరసింహారెడ్డి విమర్శించారు. రూపాయి విలువ పతనం కావడానికి మన ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణమని ఆరోపించారు. ఏటా 4.5 లక్షల మంది భారత్‌ నుంచి విద్యార్జనకు విదేశాలకు వెళుతుండడంతో 95వేల కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యం రూపంలో బయటకుపోతున్నాయని చెప్పారు. తరిమెల నాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ‘రూపా యి విలువ పతనం-అమెరికా యుద్ధోన్మాద దాడులు-ప్రజలపై ప్రభావం’ అంశంపై సమావేశం ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భం గా డాక్టర్‌ ఆర్కే రాసిన ‘చారిత్రక భౌతికవాదం ఒక పరిచయం’ పుస్తకాన్ని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాకతీయ వర్సిటీ ఆర్థిక శాస్త్ర విశ్రాంత ప్రొఫెసర్‌ తోట జ్యోతిరాణి, రచయిత భూపాల్‌, తరిమెల నాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు లక్ష్మి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 02:52 AM