అభ్యంతరాల పరిష్కారంలో నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:31 PM
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌లపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌లపై అందిన అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీక్ పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నా మినేషన్‌లపై అందిన అభ్యంతరావలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూ రు మున్సిపాలిటీలోని 18 వార్డులకు సంబంధించి ఎన్నికలు ఉంటాయ న్నారు. నామినేషన్‌లపై అందిన దరకాస్తులను ఎన్నికల నిబంధనల ప్ర కారం పరిష్కరించి అర్హులైన అభ్యర్థుల జాబితా తయారు చేయాలని, 3వ తేదీన నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అ భ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుందన్నారు. ఫిబ్రవరి 11న పోలిం గ్, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్ధులను ప్రక టిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250501ను ఏర్పాటు చేశామన్నారు.
పనులను పరిశీలించిన కలెక్టర్
అనంతరం చెన్నూరు పట్టణంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణ పనులను, అమృత్ 2.0 కింద పట్టణంలో చేపట్టిన నీటి ట్యాంకు నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అ నంతరం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం , సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.