Share News

సీఎంను కలిసిన ఆర్టీఐ కమిషనర్లు

ABN , Publish Date - May 30 , 2026 | 03:37 AM

రాష్ట్ర సమాచార కమిషన్‌లో బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాన కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్య..

సీఎంను కలిసిన ఆర్టీఐ కమిషనర్లు

  • ఏడాదిలో 14,434 కేసులను పరిష్కరించినట్లు వెల్లడి

హైదరాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార కమిషన్‌లో బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాన కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్‌, దేశాల భూపాల్‌ల బృందం సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా ఆర్టీఐ కార్యకలాపాలు, పెండింగ్‌ కేసుల పరిష్కారం, జిల్లాల వారీగా నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాల గురించి సీఎంకు ఆ బృందం వివరించింది. కమిషన్‌ ఏర్పాటైన ఏడాదిలోనే 14,434 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించింది. అలాగే 20 జిల్లాల్లో ఆర్టీఐ అవగాహన శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించింది.

Updated Date - May 30 , 2026 | 03:37 AM