kumaram bheem asifabad- మూడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:03 PM
ఆర్టీసీ సమ్మె జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో పరిధిలో మూడో రోజు కొనసాగింది. సమ్మె విరమించాలని అధికార పక్ష నాయకులు కోరుతుండగా కార్మికులు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా పోలీసు బందో బస్తు పెంచారు. డిపో పరిధిలో పూర్థి స్థాయిలో బస్సులు నడవక ప్రయాణి కులు ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సు మంచిర్యాలకు వెళ్లి వస్తుండగా ఏసీసీలో ఆటోను ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రైవర్ల నియమకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సమ్మె జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో పరిధిలో మూడో రోజు కొనసాగింది. సమ్మె విరమించాలని అధికార పక్ష నాయకులు కోరుతుండగా కార్మికులు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా పోలీసు బందో బస్తు పెంచారు. డిపో పరిధిలో పూర్థి స్థాయిలో బస్సులు నడవక ప్రయాణి కులు ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సు మంచిర్యాలకు వెళ్లి వస్తుండగా ఏసీసీలో ఆటోను ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్రైవర్ల నియమకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రయాణికులు తాత్కాలిక డ్రైవర్లను నమ్మలేక ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి తలెత్తింది. కాగా సమ్మె శిబిరంను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏమాజీలు సందర్శించి మద్దతు తెలిపారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ శిబిరాన్ని సందర్శించి కార్మికులు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకూదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమ్మె చేసుకునే హక్కు ఉందన్నారు. డిపో పరిధిలో మొత్తం 50 బస్సులు, 27 అద్దె బసులు ఉండగా మూడో రోజు 25 అద్దె బస్సులు, 20 ప్రభుత్వ బస్పులు నడిచాయి. పూర్తిస్థాయిలో బస్సులు నడవక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా వరంగల్ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు శంకర్‌గౌడ్‌కు జేఏసీ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ మంజుల, ఏఐటీయూసీ నాయకులు దివాకర్, ఉపేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, బీజేపీ నాయకులు శ్రీశైలం, ఏమాజీలు నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలో కార్మికులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.