Share News

kumaram bheem asifabad- రెండో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:36 PM

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట తమ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం స్పందించి న్యాయ చేయాలని కోరారు.

kumaram bheem asifabad- రెండో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఆసిఫాబాద్‌లో నినాదాలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

ఆసిపాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట తమ డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం స్పందించి న్యాయ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఉపేందర్‌, అశోక్‌, మంజుల, జ్యోతి, దివాకర్‌, నరేష్‌, ప్రవీణ్‌, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

బస్టాండు వద్ద బందోబస్తు..

జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండు పోలీసు బందోబస్తు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్‌, కాగజ్‌ నగర్‌ పట్టణంలో సీఐ సత్యనారాయణల ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతోంది. ఎంవీఐ మోహన్‌, డిపో మేనేజర్‌ రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో డ్రైవర్ల నియామకంతో పాటు బస్సులను నియమిత రూట్లలో పంపిస్తున్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ సమ్మె రెండో రోజు డిపో పరిధిలో మొత్తం 45 బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. దీనిలో 26 బస్సులు అద్దె కాగా, 19 ఆర్టీసీ బస్సులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 22 మంది కండక్టర్లను, 19 మంది డ్రైవర్లను డిపో పరిధిలో తాత్కాలికంగా నియమించినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ రూట్లలో ప్రస్తుతానికి బస్సులను పంపిస్తున్నామని మహారాష్ట్ర వైపు కేవలం వాంకిడి వరకు మాత్రమే పంపిస్తున్నట్లు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బస్సులు నడిపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట కార్మికులు వేసుకున్న నిరసన టెంటు పోలీసులు తీసి వేయడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు తమకు ఉందని పోలీసులు ఇలా చేయడం సరైంది కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ డిపోను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లతో ఇప్పటికే 29 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. మిగిలిన డిమాండ్లపై కూడా చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 11:36 PM