ఆర్టీసీ కార్మిక సంఘాల 31 డిమాండ్లు ఇవే..
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:43 AM
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఆర్థికపర అంశాలన్నింటినీ పరిష్కరించి.. ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి.
1.ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి.
2. ఆర్థికపర అంశాలన్నింటినీ పరిష్కరించి.. ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి.
3. 2017 నుంచి అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంచాలి. వేతన సవరణ బకాయిలను చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయాలి.
4. 2021 వేతన సవరణ 30ు ఫిట్‌మెంట్‌తో చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి.
5. కొత్త బస్సులను సంస్థ ద్వారా కొని ఆర్టీసీని అభివృద్ధి పరిచి, ఆధునీకరించాలి.
6. సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేసి.. రాయితీలు, సంస్థ అభివృద్ధికి ఏటా బడ్జెట్‌లో 3ు కేటాయించాలి.
7. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులకు సరిపడా
కొత్త డిపోలను ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ ఈవీ బస్సులకు ఇవ్వరాదు.
8. యాజమాన్యం వాడుకున్న సీసీఎస్, ఎస్‌ఆర్‌బీఎస్, పీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలి. సీసీఎస్ పాలకమండలి ఎన్నికలు నిర్వహించాలి.
9. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు టికెట్ లెస్ స్మార్ట్ కార్డు ఇవ్వాలి. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. ఈ స్కీమ్‌లో జరుగుతున్న సీఅండ్‌టీ కేసులలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.
10. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.400 కోట్లను ప్రతినెలా విధిగా చెల్లించాలి. పాత బకాయుయిలు రూ.2,500 కోట్లను వెంటనే చెల్లించాలి.
11. బ్రెడ్‌విన్నర్, మెడికల్ ఇన్‌వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన ఉండాలి. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. ప్రభుత్వ జీవో 30 ప్రకారం వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలి. ఈ స్కీమ్‌లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ వంటి పోస్టులను ఇవ్వాలి.
12. అన్ని కేటగిరీలలో ఖాళీలు భర్తీ చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి.
13. ప్రతి కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. బస్‌బాడీ బిల్డింగ్‌తోపాటు మిగిలిన వర్క్‌షా్‌పలను బలోపేతం చేయాలి. ప్రొడక్షన్ యూనిట్లలో 2013 నుంచి రావాల్సిన మ్యాన్ అవర్ రేట్‌ను అమలు చేయాలి.
14. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో అన్ని విభాగాలలో సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. రోగులు, సహాయకులకు భోజన, వసతి సౌకర్యం కల్పించాలి.
15. ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాక ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తూ.. ఉద్యోగి కుటుంబంతోపాటు తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం పొందే సౌకర్యం కల్పించాలి.
16. సంస్థలో రిటైరైన ఉద్యోగులకు సరిపడా మందులు సరఫరా చేయాలి. వైద్య పరీక్షలకయ్యే ఖర్చు యాజమాన్యమే భరించాలి.
17. రిటైరైన ఉద్యోగులకు అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలి. రిటైరయ్యే వారికి అదేరోజున అన్ని సెటిల్‌మెంట్ మొత్తాలను చెల్లించాలి.
18. అకౌంట్స్ విభాగంలో సెంట్రలైజేషన్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలి.
19. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు, సూపర్‌వైజర్లను తొలగించి.. ప్రమోషన్ల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలి.
20. ప్రైవేటు ఏజెన్సీలతో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్‌ల నియామకాలు మానుకోవాలి. ఆర్టీసీ సంస్థ నేరుగా నియామకాలు చేపట్టాలి.
21. ఉద్యోగులకు 300 ఈఎల్‌లు దాటితే ఆ లీవులను ఉద్యోగి రిటైరయ్యేలోపు ఎప్పుడైనా వాడుకునే అవకాశం కల్పించాలి.
22. అన్ని యూనిట్లలో మహిళలతోపాటు పురుషులకు అన్ని వసతులు, తాగునీరు, వాహన పార్కింగ్‌కు షెడ్స్ నిర్మించాలి.
23. పాత రెగ్యులేషన్ సమూలంగా మార్చి డ్రైవర్,
కండక్టర్, మెయింటెనెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
24. అక్రమ సస్పెన్షన్, రిమూవల్ అయినవారిని, అప్పీలు తిరస్కరణ అయిన వారిని విధుల్లోకి తీసుకోవాలి.
25. జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాసై ఉన్నవారికి పోస్టింగ్ ఇవ్వాలి. మిగిలిన ఖాళీలకు డిపార్టుమెంట్ టెస్ట్‌లు నిర్వహించి భర్తీ చేయాలి.
26. హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు తిరస్కరణ అయినవారికి మరో అవకాశం ఇవ్వాలి. డిమాండ్ నోటీసులు రానివారందరికీ ఈపీఎఫ్ నుంచి డిమాండ్ నోటీసులు ఇప్పించాలి.
27. 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తివేయాలి.
28. అద్దె బస్సులను, అద్దె బస్సుల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఆర్టీసీ సంస్థ విలీనం చేసుకోవాలి.
29. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంటల పనిదినాలు(సిటీ సర్వీసులో 7 గంటలు) అమలు చేసి మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటలలోపు పూర్తయ్యేలా డ్యూటీలు ఇవ్వాలి. ప్రతి మహిళా ఉద్యోగికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలి.
30. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన వారిని ఏపీఎ్‌సఆర్టీసీకి బదిలీ చేయాలి.
31. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో ఆల్కహాల్ తీసుకున్నట్లు రిజల్ట్ చూపితే సదరు డ్రైవర్ అభ్యంతరం చెబితే మరో బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించి నిర్ధారించాలి. రక్త నమూనాలు ల్యాబ్‌కు పంపించి సరైన నిర్ధారణ చేయాలి.