హైదరాబాద్ నుంచి మేడారానికి 400 బస్సులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:27 AM
మేడారం జాతరకు హైదరాబాద్ నుంచి ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్.రాజశేఖర్ తెలిపారు.
31 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ/ హుస్నాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతరకు హైదరాబాద్ నుంచి ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్.రాజశేఖర్ తెలిపారు. ఈనెల 26 నుంచి 31 వరకు ఉప్పల్, జగద్గిరిగుట్ట, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఈ బస్సులు మేడారం గద్దెల వరకు వెళ్తాయని తెలిపారు.
51 బస్‌స్టేషన్ల ద్వారా మేడారానికి బస్సులు
మేడారం జాతరకు రాష్ట్రవ్యాప్తంగా 51 బస్‌స్టేషన్ల నుంచి 4వేల బస్సులు నడిపిస్తున్నామని, అవసరమయితే బస్సుల సంఖ్య పెంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి సోమవారం ఆయన మేడారానికి ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే సమ్మక్క-సారలమ్మలకు ఎత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకున్న గొల్లెని యాదమ్మ, సమ్మయ్యల కోరిక మేరకు పొన్నం ప్రభాకర్ ఎత్తు బంగారం తూకం వేయించుకున్నారు.